Chandrababu: దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులా..?

Chandrababu: ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Updated on: 22 Dec 2021 8:00 PM IST
Chandrababu Condemns Attack on Ashok Gajapathi Raju
X

Chandrababu: దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులా..?

Chandrababu: ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అశోక్‌ గజపతిరాజుపై దాడికి తెగించి మంత్రులు వీధి రౌడీల్లా వ్యవహరించారని మండిపడ్డారు. దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తు దాడులు చేస్తారా అని ధ్వజమెత్తారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలన్న బుద్ధి ప్రభుత్వ పెద్దలకు లేదా అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్‌ గజపతిరాజుపై కక్షగట్టారని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తొలగించి భూములు దోచుకోవడాని ప్రయత్నించారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story