Chandrababu: జగన్ చేస్తున్న ఆరోపణల్లో పస లేదు

Chandrababu: ఆయన కుటుంబసమస్యలను ప్రతిపక్షాలపై రుద్దుతున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 May 2024 3:19 PM IST
Chandrababu Comments On Jagan
X

Chandrababu: జగన్ చేస్తున్న ఆరోపణల్లో పస లేదు

Chandrababu: సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో పస లేదని తెలిపారు. రేపు జగన్‌కు ఆయన సతీమణికి విభేదాలు వస్తే దానికి కూడా తానే కారణమవుతానా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్.. ఎన్నికల వేళ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన కుటుంబసమస్యలను ప్రతిపక్షంపై రుద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ధర్మవరంలో అమిత్ షా బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story