రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప జగన్‌ చేసిందేమీ లేదు: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు ఆ రాష్ట్ర్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.

Samba Siva Rao
Updated on: 3 Feb 2021 4:03 PM IST
రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప జగన్‌ చేసిందేమీ లేదు: చంద్రబాబు
X

ఏపీ సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు ఆ రాష్ట్ర్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. ప్రజలను మోసం చేయడం, రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప సీఎం చేసిందేమి లేదని విమర్శించారు. బుధవారం టీడీపీ నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం సీఎంకు ఇష్టం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రత్యర్థులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని.. తప్పుడు కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంటే.. ధ్వంసం చేయాలని అధికారపార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ బెదిరింపులకు తలొగ్గకుండా ధైర్యంగా నామినేషన్లు వేస్తున్న వారిని చంద్రబాబు అభినందించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో జగన్‌ విఫలమయ్యారన్నారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసం సీఎం తన పార్టీ ఎంపీలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు

Samba Siva Rao

Samba Siva Rao

Next Story