Chandrababu: రౌడీలకు రౌడీని నేను.. పెద్దిరెడ్డి నీ గుండెల్లో నిద్రపోతా

Chandrababu: విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Kranthi
Published on: 7 March 2021 6:43 PM IST
aaa
X

ఫైల్ Image

Chandrababu Comments On Peddireddy: మంత్రి పెద్ది రామచంద్రరెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రౌడీలకు రౌడీని నేను... నీ గుండెల్లో నిద్రపోతా... ప్రజలు తిరగబడితే... నీ రౌడీలు పారిపోవడం ఖాయం. బట్టలిప్పించడం ఖాయం... జాగ్రత్త. సిగ్గు.. ఎగ్గు, మానం ఏమీ లేవు అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ని ఉద్దేశించి ఘాటు వ్యాక్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. విజయవాడ మేయర్‌ పీఠం గెలవడమే తమ ముందున్నలక్ష్యం అంటూ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

25 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకువస్తామని అన్నారు. ఇప్పుడు అదే కేంద్రం ఎదుట మెడలు దించుకొని ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు, దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు .

Kranthi

Kranthi

Next Story