రాజధాని రైతులకు మద్దతుగా చంద్రబాబు భిక్షాటన

రాజధాని రైతులకు మద్దతుగా చంద్రబాబు భిక్షాటన
x
chandrababu
Highlights

రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి బిక్షాటన చేశారు. మచిలీపట్నం చేరుకున్న ఆయన కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం

రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి బిక్షాటన చేశారు. మచిలీపట్నం చేరుకున్న ఆయన కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలి పట్టుకుని భిక్షాటన చేశారు. చంద్రబాబుతో పార్టీ సీనియర్ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.

ఆ తర్వాత అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బందర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం మహాత్మ గాంధీ, ​​దివిసీమ తుఫాను సమయంలో ఎన్టీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారని, ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు తానూ జోలెపట్టానని చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తొలిసారి జోలెపట్టి అర్థించానని అన్నారు చంద్రబాబు.

తానూ ఒక్క పిలుపునిస్తే మహిళలు కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం మహిళలు కూడా ఉద్యమం చేస్తున్నారని అన్నారు. చివరికి తాళిబొట్టును సైతం విరాళంగా ఇచ్చేందుకు వెనుకాడడం లేదని చెప్పుకొచ్చారు . మచిలీపట్నంలో రూ.3,05,480లతో పాటు ఒక ఉంగరం కూడా విరాళంగా ఇచ్చారని అన్నారు. అమరావతికి అందరి ఆశీస్సులు ఉన్నాయని, దానిని కదిలించే శక్తి ఎవ్వరికీ లేదని, అడ్డొస్తే ఎవ్వరినీ వదిలేదని చంద్రబాబు వాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories