జగన్‌కు బాబు సవాల్.. గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా !

జగన్‌కు బాబు సవాల్.. గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా !
x
జగన్‌కు బాబు సవాల్
Highlights

ఈ ఏడాది సంక్రాంతి ఆనందంగా జరుపుకోలేకపోతున్నామని చంద్రబాబు అన్నారు. కష్టాల్లో ఉన్న కూడా సాంప్రదాయాలను మర్చిపోకూడదనే సంక్రాంతి నిర్వహిస్తున్నామన్నారు....

ఈ ఏడాది సంక్రాంతి ఆనందంగా జరుపుకోలేకపోతున్నామని చంద్రబాబు అన్నారు. కష్టాల్లో ఉన్న కూడా సాంప్రదాయాలను మర్చిపోకూడదనే సంక్రాంతి నిర్వహిస్తున్నామన్నారు. అమరావతి నాగరికత ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. రాష్ట్రం విడిపోయాక మనకంటూ ఓ అడ్రస్‌ ఉండాలని అమరావతికి నామకరణం చేసి నిర్మాణం చేపట్టానని తెలిపారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదికలు చెత్త రిపోర్టులు కాబట్టే బోగి మంటల్లో వేసి దహనం చేశామన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ‌ఉంటే యాక్షన్‌ తీసుకోండి కానీ దాన్ని అడ్డంపెట్టుకొని రాజధాని మార్చాలంటే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. భోగి సందర్భంగా జీఎన్ రావు, బోస్టన్ నివేదికలను మంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానులపై రెఫరెండంతో మళ్లీ ఎన్నికలకు రావాలని తేల్చిచెప్పారు. ఒకవేళ జగన్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories