న్యాయవిచారణ జరిపించండి:చంద్రబాబు సవాల్‌

న్యాయవిచారణ జరిపించండి:చంద్రబాబు సవాల్‌
x
Highlights

అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు నిరూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపడతారా అని...

అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు నిరూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపడతారా అని ప్రశ్నించారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు నిస్వార్థంగా భూములిచ్చారని చెప్పారు.

రైతు దినోత్సవం రోజున అమరావతి ప్రాంత రైతులు కన్నెర్ర చేశారు. రాజధాని తరలిపునకు వ్యతిరేకంగా ఆందోళన తీవ్రతరం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాజధాని కోసం ప్రభుత్వానికి భూములిస్తే తమను నట్టేట ముంచారని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్నాయపాలెంలో వంటావార్పు నిర్వహించిన రైతులు తుళ్లూరులో రైతులు మహాధర్నా చేపట్టారు. అయితే రైతులు వేసిన టెంట్‌లు తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్‌లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న నాటి నుంచి ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు అమరావతిలో ఇన్ సైడర్‌ ట్రేడింగ్ జరిగిందన్న అనుమానాలు ఉంటే వైసీపీ వ్యక్తులు, కమిటీలతో కాకుండా హైకోర్టు ద్వారా జుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని అనుకున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు నిస్వార్థంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని రైతులకు న్యాయం చేయడానికే ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

అమరావతిని పవిత్ర జలాలతో పునీతం చేశామని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు ఉంటే అమరావతి అభివృద్ధి జరగదని అమరావతిపై వచ్చింది జీఎన్ రావు కమిటీ రిపోర్టు కాదని జగన్ నివేదిక అని అన్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు చేసుకుందామని ప్రస్తుతం రాజధాని అభివృద్ధి ముఖ్యమన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తుళ్లూరు పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ఎస్పీలు, ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, వంద మంది కానిస్టేబుల్స్‌, 50 మంది మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories