Chandrababu: వైసీపీని ఓడిస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుంది

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ముఖ్య నేతల సమావేశం

Sandeep Eggoju
Published on: 1 Nov 2021 9:44 PM IST
Chandrababu Chaired TDP Main Leaders Meeting
X

చంద్రబబు అధ్యక్షతన టీడీపీ ముఖ్య నేతల సమావేశం (ఫైల్ ఇమేజ్)

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉంటుందని చంద్రబాబు అన్నారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని అమరావతిని నిరుపయోగం చేశారని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బట్టబయలైందన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తుల కోసం బడి పిల్లలను బజారుకీడ్చారన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story