జోలె పట్టిన చంద్రబాబు

జోలె పట్టిన చంద్రబాబు
x
Highlights

రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి బిక్షాటన చేశారు. మచిలీపట్నం చేరుకున్న ఆయన కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలి...

రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి బిక్షాటన చేశారు. మచిలీపట్నం చేరుకున్న ఆయన కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలి పట్టుకుని భిక్షాటన చేశారు. చంద్రబాబుతో పార్టీ సీనియర్ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.

విజయవాడలో అఖిలపక్ష నేతలను అరెస్ట్ ను నిరసనగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కల్యాణదుర్గం టీ సర్కిల్ లో మానవహారంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గన్ మెన్ స్థానిక నేతలతో దురుసుగా ప్రవర్తించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఎమ్మెల్యే వాహనం పక్క నుంచి వెళ్లి పోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories