Pawan Kalyan: రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మంగళగిరి పార్టీ కార్యాలయం దాకా నడుచుకుంటూ వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం

Jyothi
Published on: 10 Sept 2023 7:30 AM IST
Chandrababu Arrest Pawan Kalyan Sleeps On Road As Police Deny Him Permission To Enter AP
X

Pawan Kalyan: రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఎన్టీఆర్ జిల్లా అనుమంచి పల్లివద్ద ఉద్రిక్తత. హైదాబాద్‌నుంచి రోడ్డుమార్గాన బయలుదేరిన పవన్ ‌కళ్యాణ్‌ను కృష్ణా జిల్లా సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కారు దిగి నడుచుకుంటూ వెళ్లాలని పవన్ కళ్యాణ్‌ నిర్ణయించారు. జనసేన కార్యకర్తలతో కలిసి మంగళగిరి పార్టీ కార్యాలయం దాకా నడిచివెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌ రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు.

Jyothi

Jyothi

Next Story