Chandrababu: జగన్ దుర్మార్గుడు.. వైసీపీది ఉగ్రవాద దాడి

Chandrababu: ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్ష ముగింపు సభలో చంద్రబాబు జగన్ పై ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.

Arun Chilukuri
Published on: 22 Oct 2021 9:13 PM IST
Chandrababu 36 Hours Deeksha ends
X

Chandrababu: జగన్ దుర్మార్గుడు.. వైసీపీది ఉగ్రవాద దాడి

Chandrababu: ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్ష ముగింపు సభలో చంద్రబాబు జగన్ పై ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. వైసీపీది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని దేవాలయం లాంటి తమ పార్టీ కార్యాలయంపై దాడులు జరిపారని మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు మొట్టినా, మందలించినా వెనకడుగు వేయని మొండి వాడు, మూర్ఖుడు,దుర్మార్గుడంటూ ఫైరయిపోయారు. జగన్ వాడుకుని అవసరం తీరాక వదిలేసే రకమన్నారు.

తాను జైల్లో ఉన్నప్పుడు తల్లిని, చెల్లిని తన గెలుపు కోసం ఊరూరా తిప్పారన్నారు. ఆ తర్వాత వారిని గాలికి వదిలేశారన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని సీఎం ఇక రాష్ట్రానికేం చేస్తాడని మండి పడ్డారు. గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు. మేం ఆధారాలు ఇస్తాం.. పోలీసులు యూనిఫాం తీసేయాలని చంద్రబాబు నాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కదిలి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story