Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం స్పెషల్ ఆఫీసర్‌గా ఆజాద్ నియామకం

Brahmamgari Matam News Today: మఠం వ్యవహారాలపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి చర్యలు

Sandeep Eggoju
Updated on: 24 Jun 2021 1:30 PM IST
Chandra Shekhar Azad Appointed as Brahmamgari Matam Special Officer
X

బ్రహ్మంగారి మఠం (ఫైల్ ఇమేజ్)

Brahmamgari Matam News Today: కడప వీరబ్రహ్మాంగారి మఠం పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారిగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ నియమితులయ్యారు. మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై మంత్రి వెల్లంపల్లి చర్యలు చేపట్టారు. పీఠాధిపతి నియామకం, అవినీతి అక్రమాలపై ఆజాద్ చర్యలు చేపట్టారు. మంత్రి గడువు ఇచ్చిన బ్రహ్మంగారి వంశీకుల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో.. ప్రత్యేక అధికారిని నియమించారు. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. మఠం మేనేజర్ నెల రోజుల సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్‌గా ఉన్న ఆజాద్‌ను పీఠాధిపతికి ప్రత్యేక అధికారిగా నియమించింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story