Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటనలో అనూహ్య ఘటన

Arun Chilukuri
Published on: 26 Feb 2021 12:55 PM IST
Chandrababu facing problem with power cut in Kuppam visit
X

చంద్రబాబుకు కుప్పం పర్యటనలో అనూహ్య ఘటన

ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం పర్యటనలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు బస చేస్తున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు విద్యుత్ సరఫరా నిలిపేసారు. దీనిపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే చంద్రబాబు బస చేస్తున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌ కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. జనరేటర్ లేదని, కనీసం బ్యాటరీ కూడా ఇవ్వలేదన్నారు. రాబోయే రోజుల్లో తాము కూడా ఇటువంటి షాకే ఇస్తామని అమర్నాథ్ రెడ్డి అన్నారు. అయితే కుప్పం అధికారుల వాదన మరోలా వుంది. ట్రాన్స్‌ఫర్ లో సాంకేతిక సమస్యతో విద్యుత్ అగిపోయిందని మరమ్మతులు చేస్తునట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story