Andhra Pradesh: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌

Andhra Pradesh: పరీక్షలపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ * ప్రతిపాదనలపై సీఎంతో చర్చించే అవకాశం

Sandeep Eggoju
Updated on: 17 Jun 2021 12:46 PM IST
Chance to Make a key Decision on 10th and Inter Exams
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షలపై ఇవాళ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాసేపట్లో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్ , టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ.. వాటిని సీఎం ముందు ఉంచనుంది. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు, జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎం నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story