AP News: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ సవాళ్లు

AP News: చెప్పులు, రాళ్లతో రఘునాథ్‌రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి

Dhatripriya
Published on: 1 April 2023 1:26 PM IST
Challenges Of TDP And YSRCP On The Development Of Puttaparthi
X

AP News: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ సవాళ్లు

AP News: శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్లు.. టెన్షన్‌ వాతావరణానికి దారి తీశాయి. ప్రమాణం చేసేందుకు సత్తెమ్మ ఆలయానికి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి చేరుకున్నారు. ఈ క్రమంలో చెప్పులు, రాళ్లతో రఘునాథ్‌రెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఘటనను నిరసిస్తూ.. రోడ్డుపై బైఠాయించారు పల్లె రఘునాథ్‌రెడ్డి. వైసీపీ దౌర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు పల్లె రఘునాథ్‌రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story