ఏపీలో పెట్రోలు, డీజిల్‌పై సెస్ విధింపు

X
Highlights
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్...
Arun Chilukuri18 Sep 2020 10:30 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాట్ కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నట్లు తెలిపింది. రహదారి అభివృద్ధి నిధి కోసం దీన్ని వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సెస్ ద్వారా రూ.600కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తాన్ని డీలర్ నుంచి వసూలు చేయాలని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్డినెన్స్ జారీ అనంతరం సెస్ పెంపుపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
Web Titlecess imposed on petrol and diesel in Andhra Pradesh
Next Story