Y category security to MP Raghu Rama Krishnam Raju : ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత!

Y category security to MP Raghu Rama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు..

Krishna
Published on: 6 Aug 2020 2:16 PM IST
Y category security to MP Raghu Rama Krishnam Raju : ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై కేటగిరి భద్రత!
X
Raghu Rama Krishnam Raju(File Photo)

Y category security to MP Raghu Rama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ప్రభుత్వం నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ సొంత పార్టీ పైనే తిరుగుబాట జెండా ఎగరవేస్తున్నారయన..అయితే తాజాగా ఆయనకి కేంద్రం 'వై' కేటగిరి భద్రతను పెంచింది.. సుమారుగా 10 మంది వరకు ఆయనకి భద్రతా సిబ్బంది ఉండనున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో 'వై' కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

గతంలో అయన సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందంటూ ఎంపీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించిన తర్వాతే నియోజకవర్గానికి వెళతానని అయన గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండిపోయారు. దీనిపైన స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది. ఈమేరకు ఏపీ డీజీపీ, సీఆర్పీఎఫ్‌ డీజీకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

Krishna

Krishna

Next Story