AP Capital: ఏపీ రాజధానిపై కుండబద్దలు కొట్టిన కేంద్రం.. అమరావతే రాజధాని..!

Centre Clarifies on Andhra Pradesh Capital
x

AP Capital: ఏపీ రాజధానిపై కుండబద్దలు కొట్టిన కేంద్రం.. అమరావతే రాజధాని..

Highlights

Amaravati: ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీనిచ్చింది.

Amaravati: ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీనిచ్చింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతి విజభన చట్టం ప్రకారమే ఏర్పాటయ్యిందని కేంద్రం తెలిపింది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని తెలిపింది. అమరావతే రాజధానిగా 2015లోనే నిర్ణయించిందంది. అమరావతి రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారీటి నిచ్చింది. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories