ఫలించిన సీఎం జగన్ ఢిల్లీ టూర్

ఫలించిన సీఎం జగన్ ఢిల్లీ టూర్
x
Highlights

ఏపీ సీఎం జగన్ ఢిల్లీటూర్ ఫలించింది. నివర్ తుపాను బాధిత రైతులకు నష‌్టపరిహారం చెల్లించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నివర్ బాధిత రైతుల కష్టాలను...

ఏపీ సీఎం జగన్ ఢిల్లీటూర్ ఫలించింది. నివర్ తుపాను బాధిత రైతులకు నష‌్టపరిహారం చెల్లించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నివర్ బాధిత రైతుల కష్టాలను సీఎం జగన్‌ కేంద్రానికి వినిపించగానే నష్టపరిహారం చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే నివర్ తుఫాన్‌ కారణంగా ఎంతమేర పంట నష్టమైంది. ఎక్కడెక్కడ నష్టమైందో తెలుసుకోవడానికి కేంద్రం ఆరా తీసే పనిలో పడింది. ఈ మేరకు కేంద్ర బృందాలు నేటి నుంచి రెండు రోజుల పాటు నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నాయి.

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీటూర్ నివర్ తుఫాన్ బాధిత రైతులకు వరంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కావాల్సిన సౌకర్యాలు ఏపీకి కల్పించాలంటూ ఏపీ సీఎం కేంద్రమంత్రులకు విన్నవించారు. అయితే ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారందరికీ న్యాయం చేయాలని కేంద్రానికి ఏపీ సీఎం విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం ఎంత మేర పంట నష్టం జరిగిందో తెలుసుకోవడానికి కేంద్ర బృందాలను ఏపీకి పంపించనుంది.

కేంద్ర బృందాలు నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలోని నివర్ ‌తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. నేడు చిత్తూరు జిల్లాలో ఒక బృందం, నెల్లూరు జిల్లాలో మరోక బృందం పర్యటించనున్నాయి. నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎంత మేరకు నష్టం జరిగిందో అంచనా వేయనున్నారు.

ఇక రేపు గుంటూరు జిల్లాలో ఒక బృందం, వైఎస్సార్‌ జిల్లాలో మరో బృందం పర్యటించనుంది. కేంద్ర బృందాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు విపత్తుల శాఖ కమిషనర్‌ తెలిపారు. ఈ ఏడాది ఆకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికచ్చిన పంట నాశనం అయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని స్థానిక రైతులు వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories