పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్
x
Highlights

పోలవరం నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, పునరావాసంతో సంబంధం లేదంటూ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. 2016 సెప్టెంబర్‌ నాటి కేంద్ర ఆర్థిక...

పోలవరం నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, పునరావాసంతో సంబంధం లేదంటూ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. 2016 సెప్టెంబర్‌ నాటి కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారం పోలవరం నిర్మాణం నిధులు మాత్రమే కేంద్ర భరిస్తుందని స్పష్టం చేసింది. ఆర్టీఐ ద్వారా తాజాగా బయటపడ్డ విషయాలు ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టు పై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలవరం డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, అది కూడా 2013 -14 లో పేర్కొన్న అంచనాల మేరకే చెల్లిస్తామని కేంద్రం పేర్కొంది. ఇక పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఏపీ సర్కార్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది.

చంద్రబాబు ప్రభుత్వం గతంలో 2014 రేట్లకు పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి ఆమోదం తెలిపి తీవ్ర నష్టం చేసిందని, లక్ష మంది నిర్వాసితులను గాలికి వదలివేసిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈరోజు కేంద్రం కొర్రీలు పెడుతోందని నిప్పులు చెరిగారు.

పోలవరం ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడితే సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే పోలవరం పనులు 71 శాతానికి పైగా పూర్తయ్యాయని తెలిపారు.

రాష్ట్ర పునర్విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ పోలవరం నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, పునరావాసంతో సంబంధం లేదంటూ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. నిధుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఏదో ఒక కొర్రీలు పెడుతున్న పరిస్థితి ఉంది . ఇక ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ ఏం చెయ్యనుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories