Amaravati: ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్రం నిధులు విడుదల

Amaravati: అమరావతి పేరుతో బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం

Rama Rao
Updated on: 2 March 2022 8:30 PM IST
Central Government has released funds recognizing the AP capital Amravati
X

ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్రం నిధులు విడుదల

Amaravati: ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్రం మరోసారి నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. రాజధాని అమరావతి పేరుతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టింది. అమరావతినే ఏపీ రాజధానిగా పేర్కొంటూ 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది.

విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రొవిజన్ తీసుకొచ్చింది. సచివాలయ నిర్మాణానికి 1,214 కోట్లు, ఉద్యోగుల నివాస గృహాల కోసం 1,126 కోట్లు అంచనా వ్యయంగా ప్రొవిజన్‌లో కేంద్రం పేర్కొంది.

Rama Rao

Rama Rao

Next Story