Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం మరోసారి స్పష్టత

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 15 March 2021 5:59 PM IST
Central Government Clarifies on Privatisation of Vizag steel plant
X

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ( ఫైల్ ఇమేజ్ )

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ జవాబు ఇచ్చారు. వంద శాతం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని..స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలను కలిపి ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సమాధానం ఇచ్చారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీరణకు వ్యతిరేకంగా ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన విభాగం వద్ద ధర్నా చేపట్టింది. కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story