ఏపీలో ఎన్నికల వేళ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ..

Raj
By Raj
Published on: 27 March 2019 6:57 AM IST
ఏపీలో ఎన్నికల వేళ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ..
X

ఏపీలో ఎన్నికల వేళ పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు తోపాటు వైఎస్సార్ కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఇటీవల వీరిపై ఫిర్యాదు చేశారు. దాంతో వీరిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. కాగా వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక దర్యాప్తు అధికారిగా ఉన్న రాహుల్‌దేవ్‌ శర్మను బదిలీ చేయడం పెద్ద చర్చనీయాంస్యమైంది. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారని పలుమార్లు వైసీపీ ఫిర్యాదు చేసింది.

Raj

Raj

Next Story