Steel Plant: స్టీల్ ప్లాంట్‌ అమ్మకంపై ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

Vizag Steel Plant: స్టీల్ ప్లాంటులో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదు

Sandeep Eggoju
Published on: 28 July 2021 1:02 PM IST
Central Affidavit in AP High Court on Steel Plant Selling
X

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకంపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంటులో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని అఫిడవిట్‌లో పేర్కొన్న కేంద్రం అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపింది. వంద శాతం స్టీల్ ప్లాంటు అమ్మకాలు జరుపుతామని మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే బిడ్డింగ్ లను కూడా ఆహ్వానించామంది. జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ఉద్దేశ్యంతో పిటిషన్ వేశారన్న కేంద్రం.. పిటిషన్ కు విచారణ అర్హత లేదని తెలిపింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story