Steel Plant: 100 శాతం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు స్పష్టం చేసిన కేంద్రం

Vizag Steel Plant: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో 377 నిబంధన కింద

Sandeep Eggoju
Published on: 1 Sept 2021 7:30 AM IST
Center has Made it Clear about Steel Plant Privatization
X

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వంద శాతం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో 377 నిబంధన కింద టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు లేవనెత్తిన అంశానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్రప్రసాద్‌ సింగ్ సమాధానమిచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణతో మెరుగైన నిర్వహణ పద్దతుల అమలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సామర్థ్యం విస్తరణకు మూలధనాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే.. అధిక ఉత్పత్తి, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు రెట్టింపు స్థాయికి పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ చర్యలు ఏపీ ఆర్థికవృద్ధికి దోహదపడతాయన్న ఉక్కుశాఖ మంత్రి.. ప్రస్తుత సిబ్బంది, వాటాదారులకు చెందిన అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాకే షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ జరుగుతుందని అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story