Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

Arun Chilukuri
Published on: 12 Jan 2026 2:10 PM IST
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
X

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబం, హీరోయిన్ డింపుల్ హయాతి, రచయిత చంద్రబోస్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తమిళ హీరో అరుణ్ విజయ్ వేరువేరుగా స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story