CCTV Cameras at Covid Hospitals: కోవిడ్ ఆస్పత్రులపై నిత్యం నిఘా.. త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు

CCTV Cameras at Covid Hospitals: కోవిడ్ ఆస్పత్రులపై నిత్యం నిఘా.. త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు
x
CC Cameras
Highlights

CCTV Cameras at Covid Hospitals: కోవిద్ రోగులకు మెరుగైన వైద్యం అందించే తీరును నిత్యం పరిశీలన చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది.

CCTV Cameras at Covid Hospitals: కోవిద్ రోగులకు మెరుగైన వైద్యం అందించే తీరును నిత్యం పరిశీలన చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో రోగులకు అందే సేవలపై వీడియోలు రావడంతో ఈ చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు ప్రస్తుతం రోగులు పెరుగుతున్న కారణంగా వీలైనంత వరకు బెడ్స్ పెంచడంతో పాటు వాటిలో అందే సేవలపై నిత్యం పర్యవేక్షణకు ఈ వ్యవస్థ దోహద పడనుంది. ఇప్పటికే 104 కాల్‌సెంటర్‌ ద్వారా కోవిడ్‌ బాధితులకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. బాధితులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది.

► రెండు రోజుల్లో ముందుగా 108 ఆస్పత్రుల్లో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెడుతోంది.

► ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో కూడా సీసీ కెమెరాలు అమరుస్తారు.

► బాధితుల బంధువులు సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా వీటి ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు చికిత్సపై వాకబు చేస్తారు.

సీసీ కెమెరాల ద్వారా పక్కాగా పర్యవేక్షణ

► ఐసీయూ, నాన్‌ ఐసీయూ, జనరల్‌ వార్డులన్నింటిలో సీసీ కెమెరాలు. నేరుగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించడానికి వీలుగా వారికి సీసీ కెమెరా లింకులు.

► కోవిడ్‌ బాధితులకు సకాలంలో చికిత్స అందుతోందా? మందులు ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? ఆక్సిజన్, వెంటిలేటర్‌ పడకల సౌలభ్యం వంటివన్నీ పర్యవేక్షించే వీలు.

► ఎక్కడైనా రోగులు అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు అనుమానమొస్తే తక్షణమే ఆ ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు.

► డ్యూటీలో ఉన్న వైద్యులే చికిత్సకు బాధ్యులు

► రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తక్షణమే చర్యలు

► ప్రతి ఆస్పత్రికి సంబంధించిన అధికారి మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను డిస్‌ప్లే బోర్డులో ఉంచుతారు.

► ఎవరైనా అధికారులు, వైద్యులు సకాలంలో స్పందించకపోతే 104కు కాల్‌ చేసి 2 నొక్కితే పూర్తి వివరాలు బాధితుడి సహాయకులు లేదా బంధువులకు అందిస్తారు.

► సీసీ కెమెరాలతో ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో నేరుగా తెలుసుకుని బాధితులకు సత్వర న్యాయం అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories