Viveka Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

Viveka Reddy: ఆయుధాల కోసం మూడవ రోజు కొనసాగుతున్న గాలింపు * పులివెందులలోని తూర్పు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో గాలింపు

Sandeep Eggoju
Published on: 9 Aug 2021 12:17 PM IST
CBI Speedup the Investigation on Ex Minister Viveka Death Case
X

వైస్ వివేకా రెడ్డి కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం (ఫైల్ ఇమేజ్)

Viveka Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయుధాల కోసం మూడవ రోజు గాలింపు చర్యలు చేపట్టింది. పులివెందులలోని తూర్పు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న వంకలో జేసీబీలతో ఆయుధాల కోసం వెతుకుతున్నారు. రెండు రోజులుగా వెతుకుతున్న ఆయుధాల ఆచూకి లభించలేదు.. దాంతో మరోమారు మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అధికారులతో కేసు దర్యాప్తు వివరాలను వైఎస్ వివేకా కూతురు సునీత అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. పులివెందులోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న గరం డాల్ బ్రిడ్జి వద్ద పారిశుద్ధ కార్మికులతో సీబీఐ అధికారులు ఆయుధాల కోసం అన్వేషిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story