Top
logo

CBI: వైఎస్ వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ

CBI Speeds Up Investigation In YS Viveka Case
X

వైఎస్‌ వివేకా(ఫైల్ ఇమేజ్ )

Highlights

CBI: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 11వ రోజు కొనసాగుతోంది.

CBI: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 11వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్‌ జైల్‌ కార్యాలయంలో న‌లుగురు అనుమానితుల‌ను అధికారులు ప్రశ్నించారు. విచారణకు వివేకా సన్నిహితుడు గంగిరెడ్డి, మైన్స్‌ యజమాని గంగాధర్ హాజరయ్యారు. వీరితో పాటు సింహాద్రిపురం మండ‌లం సుంకేశుల‌కు చెందిన జ‌గ‌దీశ్వర్‌రెడ్డిని, ఓ మహిళ‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

వివేకానంద రెడ్డి హత్యకేసులో అరెస్టై కొద్దీ రోజుల క్రితం జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు గంగిరెడ్డి. అయితే వివేకానంద హత్య జరిగిన ప్రదేశంలో గంగిరెడ్డి సాక్ష్యాలు తారుమారు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని సీబీఐ అధికారులు గురువారం విచారిస్తున్నారు.

Web TitleCBI Speeds Up Investigation In YS Viveka Case
Next Story