CBI: పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం

CBI: ఏపీలో జడ్జిలను కించపరుస్తూ కొన్నాళ్లుగా అనుచిత వీడియోలు చేస్తున్న ఎన్నారై పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 25 Nov 2021 6:38 PM IST
CBI Ready to Arrest Punch Prabhakar
X

CBI: పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం

CBI: ఏపీలో జడ్జిలను కించపరుస్తూ కొన్నాళ్లుగా అనుచిత వీడియోలు చేస్తున్న ఎన్నారై పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 1న ప్రభాకర్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు, ప్రభాకర్ అడ్రస్ ను అమెరికా ఎఫ్ బిఐ అందించిందని సీబీఐ డైరక్టర్ జైశ్వాల్ ఏపీ హైకోర్టుకు తెలిపారు. ప్రభాకర్ ఇప్పటి వరకూ అప్ లోడ్ చేసిన యూట్యూబ్ కంటెంట్ ను తొలగించాలని యూట్యూబ్ ను కూడా కోరామన్నారు.

ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని కోర్టుకు జైశ్వాల్ తెలిపారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ వైసీపీ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ జగన్ ను వ్యతిరేకించే వారిని విమర్శిస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. జడ్జిలపై కూడా అనుచిత వ్యాఖ్యలుచేయడంతో ఏపీ హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story