రాయపాటి నివాసంలో ముగిసిన సీబీఐ సోదాలు

రాయపాటి నివాసంలో ముగిసిన సీబీఐ సోదాలు
x
Highlights

హైదరాబాద్‌, గుంటూరులోని రాయపాటి నివాసాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కెనరా బ్యాంక్‌ కేసు విషయంలో అధికారులు విచారణ...

హైదరాబాద్‌, గుంటూరులోని రాయపాటి నివాసాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కెనరా బ్యాంక్‌ కేసు విషయంలో అధికారులు విచారణ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా డాక్యుమెంట్లు, బ్యాంక్‌ నోటీసులను సీబీఐ అధికారులు పరిశీలించారు. రాయపాటి స్టేట్‌మెంట్‌ను కూడా అధికారులు రికార్డ్‌ చేశారు. ఈ తనిఖీల్లో బెంగుళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారులతో పాటు బ్యాంక్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. విచారణ చేస్తున్న అధికారులకు రాయపాటితోపాటు కుటుంబ సభ్యులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. కెనరా బ్యాంక్‌- ట్రాన్స్‌ ట్రాయ్‌‌ మధ్య ఉన్న ఆర్థిక వివాదంపైనే విచారణ జరిగిందని రాయపాటి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక గుంటూరులోని రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు ముగిసాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories