ముగిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. 5 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు..

CBI Questioned 5 Hours to MP Avinash Reddy
x

ముగిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. 5 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు..

Highlights

CBI Questions Avinash Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తొలిరోజు సీబీఐ విచారణ ముగిసింది.

CBI Questions Avinash Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తొలిరోజు సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటలపాటు అవినాష్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అవినాష్‌తో పాటు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను కూడా సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది..? నిందితులు భాస్కర్ రెడ్డి ఇంటికి రావడానికి గల కారణాలు..? హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపివేయడంపై సీబీఐ అధికారులు వీరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం.. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories