Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ వాయిదా

Viveka Murder Case: రేపు ఉ.10.30 గంటలకు విచారిస్తామన్న సీబీఐ

Jyothi
Published on: 18 April 2023 4:08 PM IST
CBI Postponed  MP Avinash Reddy Investigation
X

Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ వాయిదా

Viveka Murder Case: మాజీమంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం పదిన్నర గంటలకు అవినాష్‌ను ప్రశ్నిస్తామని హైకోర్టుకు తెలిపారు సీబీఐ అధికారులు. ముందుగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని అవినాష్‌కు సీబీఐ నోటీసులిచ్చింది. అయితే.. హైకోర్టులో అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. రేపు ఉదయం పదిన్నర గంటలకు విచారిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

మరోవైపు.. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై కోర్టులో తారాస్థాయిలో వాదనలు జరుగుతున్నాయి. అవినాష్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి, సునీతరెడ్డి తరఫు న్యాయవాది రవిచందర్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీబీఐ విచారణకు అవినాష్‌ పూర్తిగా సహకరిస్తారని కోర్టుకు తెలిపారు అవినాష్‌ తరఫు న్యాయవాది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అవినాష్‌ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story