Avinash Reddy: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఉన్న ఆసుపత్రికి చేరుకున్న సీబీఐ అధికారులు

Avinash Reddy: ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు

Jyothi
Published on: 22 May 2023 9:49 AM IST
CBI officials Reach Hospital in Kurnool
X

Avinash Reddy: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఉన్న ఆసుపత్రికి చేరుకున్న సీబీఐ అధికారులు

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసకుంది. కర్నూలులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా అక్కడే ఉంటున్నారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ గతంలో అవినాష్‌కు నోటీసులు పంపింది. అయితే, ఆ రోజు తాను విచారణకు హాజరుకాలేనంటూ ఎంపీ సీబీఐకి తెలిపారు.

ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆసుపత్రికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. తదుపరి ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉంటే, వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story