YS Avinash Reddy: కడప ఎంపీకి మరోసారి సీబీఐ నోటీసులు

YS Avinash Reddy: అవినాష్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ

Dhatripriya
Published on: 20 May 2023 11:52 AM IST
CBI Notices To Kadapa MP Avinash Reddy
X

YS Avinash Reddy: కడప ఎంపీకి మరోసారి సీబీఐ నోటీసులు

YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి CBI మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మొదట ఈనెల 16న విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని... 4 రోజుల సమయం ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. దీంతో ఈనెల 19న విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది.

అయితే తన తల్లికి అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనని రెండోసారి కూడా అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో సీబీఐ మూడోసారి నోటీసులు జారీ చేసింది. అయితే మొదటి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సీబీఐ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

Dhatripriya

Dhatripriya

Next Story