జగన్‌ హాజరు మినహాయింపుపై సీబీఐ కోర్టు తీర్పు నేడే

జగన్‌ హాజరు మినహాయింపుపై సీబీఐ కోర్టు తీర్పు నేడే
x
Highlights

ముఖ్యమంత్రి అయినందున ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిటిషన్‌

ముఖ్యమంత్రి అయినందున ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న ఇక్కడి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇవాళ(శుక్రవారం) తీర్పు వెలువరించనుంది. ముఖ్యమంత్రిగా ప్రజలకోసం పనిచేయాల్సి ఉండగా వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సీఎం హోదాలో ఒక్కరోజు ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వస్తే సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ తదితర వాటికి లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని.. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని, దీనివల్ల రాష్ట్రం నెత్తిన మరింత భారం పడుతుందని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారనే అరెస్టు చేశామని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కోర్టుకు హాజరు కాకుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. ఇరు వాదనలు విన్న ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories