ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు

Andhra Pradesh:ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 28 April 2021 6:37 PM IST
CBI Notice To ys Jagan
X

వైస్ జగన్ ఫైల్ ఫోటో 

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ తిరుబాటు ఎంపీ రఘరామకృష్ణరాజు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వచ్చే నెల 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు తాజాగా బుధవారం జగన్‌కు నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని జగన్‌, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story