Viveka Murder Case: సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు

CBI Counter Filed In High Court On Sunil Yadav Bail Petition
x

Viveka Murder Case: సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు

Highlights

Viveka Murder Case: వివేకా రాజకీయాలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదు

Viveka Murder Case: వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వైఎస్ అవినాష్‌రెడ్డి, శివశంకర్ రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని సీబీఐ పేర్కొంది. ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి బదులు తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. తనకు ఇవ్వకపోయినా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని పేర్కొంది. వివేకా రాజకీయ కదిలికలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని సీబీఐలో తెలిపింది. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రి వై.ఎస్. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ వెళ్లాడని ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్య స్థలానికి వెళ్లాడని తెలిపింది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజీ కట్టారని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories