YS Viveka: సీబీఐ కీలక ప్రకటన.. ఆచూకీ తెలిపితే రూ.5లక్షల రివార్డు

YS Viveka: వైఎస్ వివేకా మృతి కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది.

Arun Chilukuri
Updated on: 21 Aug 2021 11:20 AM IST
CBI Announces Rs 5 Lakh Reward Over Information in YS Viveka Murder Case
X

YS Viveka: సీబీఐ కీలక ప్రకటన.. ఆచూకీ తెలిపితే రూ.5లక్షల రివార్డు 

YS Viveka: వైఎస్ వివేకా మృతి కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది. నిందితుల ఆచూకీ తెలిపితే 5 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. కచ్చితమైన సమాచారం అందిస్తే రివార్డు ఇస్తామని తెలిపింది. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది సీబీఐ. వారు ఫోన్‌ నంబర్ల ద్వారా కానీ, కార్యాలయంలో గానీ తమను సంప్రదించవచ్చని తెలిపారు. దాదాపు ఏడాది నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న సీబీఐ అనేక మంది అనుమానితులను ఇప్పటికే పలు దఫాలు ప్రశ్నించింది. మూడు నెలల కిందట నాలుగో దఫా విచారణ చేపట్టిన సీబీఐ వరుసగా 75 రోజుల పాటు విచారణ చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story