Casino in Gudivada: మంత్రి ఇలాఖాలో గోవా కల్చర్

Casino in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో సెటప్

Rama Rao
Published on: 18 Jan 2022 9:34 AM IST
Casino Setup in Gudivada Krishna District | AP News Today
X

మంత్రి ఇలాఖాలో గోవా కల్చర్

Casino in Gudivada: సంప్రదాయ రీతిలో జరుపుకునే సంక్రాంతి పండక్కి కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో కల్చర్ తీసుకొచ్చారు. గోవాని తలదన్నే రీతిలో గుడివాడలో క్యాసినో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రచ్చరచ్చ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడిపందాలు, పేకాటలు దాటి మరో అడుగు ముందుకేసి ఏకంగా క్యాసినోనే పెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గోవా, శ్రీలంక మాదిరి ప్రతి టేబుల్‌పై ప్రొఫెషనల్ డీలర్స్‌తో గేమ్ సాగింది. ఎంట్రీ ఫీజు ద్వారానే కోట్ల రూపాయల వసూలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 2కోట్ల నుంచి 3 కోట్ల వరకు బిజినెస్ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.

మంత్రి కొడాలి నాని నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి పండుగ వేళ జుదశాల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించడంపై రాజకీయ రగడ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story