చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లర్లపై కేసులు నమోదు

Chittoor: పుంగనూరులో అల్లర్లకు పాల్పడిన ఘటనపై 4 కేసులు నమోదు చేసిన పోలీసులు

Jyothi
Published on: 6 Aug 2023 11:54 AM IST
Cases Registered Against Punganur Riots in Chittoor District
X

చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లర్లపై కేసులు నమోదు

Chittoor: చిత్తూరు జిల్లా పుంగనూరులో అల్లర్లకు పాల్పడిన ఘటనపై 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం సహా.. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారంటూ కేసులు నమోదు చేశారు. అన్ని కేసుల్లోనూ టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డిని A1గా చేర్చారు పోలీసులు. వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డ పోలీసులు.. ఇప్పటివరకు 60 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసినట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story