TDP Leader Somireddy: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

TDP Leader Somireddy: మాజీమంత్రి సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి.

Kranthi
Published on: 6 Jun 2021 12:42 PM IST
Case Registered Against TDP Leader Somireddy Chandramohan Reddy
X

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

TDP Leader Somireddy: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కృష్ణపట్నం పీఎస్ లో కేసు నమోదయ్యింది. సుశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే సెశ్రిత కంపెనీ, సర్వేపల్లి ఎమ్మెల్స్యే కాకాణి గోవర్థన్ రెడ్డిపై శనివారం సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు కాకాణి కుట్ర చేశారని ఆరోపించారు. మందు అమ్మకానికి వెబ్ సైట్ తయారు చేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెశ్రిత ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమిరెడ్డి పై కేసు నమోదు చేశారు.

Kranthi

Kranthi

Next Story