Pawan Kalyan: బిగ్ షాక్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కేసు నమోదు?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై ,చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆయన పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Case registered against AP Deputy CM Pawan Kalyan
X

Pawan Kalyan: బిగ్ షాక్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కేసు నమోదు?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఊహించని విధంగా షాక్ తగిలినట్లు సమాచారం. పవన్ లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. శుక్రవారం తిరుపతిలో సనాతన ధర్మంపై వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై సంచలన కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మించలేదని..అలా ఎవరైనా ప్రయత్నించినట్లయితే మీరే కొట్టుకుపోతారంటూ వ్యాఖ్యానించారు.

తాను సనాతన హిందువుని..అలాంటి వ్యక్తులు రావచ్చు..పొవచ్చు అన్నారు. కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సైతం ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని దాన్ని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోని మదురైలోని వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై పోలీసుల అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . ఉదయనిధిపై, మైనార్టీలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నట్లు సమాచారం. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కాగా పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story