Y S Jagan: వైసీపీకి షాక్‌.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై కేసు నమోదు

Y S Jagan: జగన్‌తో పాటు ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌పై కేసు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 July 2024 2:09 PM IST
Case Filed On Ys Jagan With Complaint Of Tdp Mla Raghu Rama Krishna Raju
X

Y S Jagan

Y S Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 120బీ, 166, 167, 197, 307, 326, 465, 504(34) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గత సీఎం జగన్ ఒత్తిడితోనే తనను అక్రమంగా అరెస్ట్ చేసి, సునీల్‌కుమార్ వేధించారంటూ కంప్లయింట్‌లో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు. కస్టడీ సమయంలో తనపై సునీల్‌కుమార్ హత్యాయత్నం చేశారని ఆరోపించారు. దీంతో ఏ1గా ఐపీఎస్ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ సీతారామాంజనేయులు, ఏ3గా జగన్‌ పేరును చేర్చారు పోలీసులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story