ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Arun Chilukuri
Published on: 16 Dec 2020 5:03 PM IST
ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు
X

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ప్రముఖ న్యాయవాది, ఏపీ ప్రజా న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్రె శ్రీనివాసరావు. ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్‌లోని సూర్యారావుపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు.. నిమ్మగడ్డపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ విజయవాడలో ఉన్నట్టుగా ఇల్లు అద్దెకు తీసుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్‌, సీఎం జగన్‌, డీజీపీ, సీపీకి ఫిర్యాదు చేశారు శ్రీనివాసరావు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story