మరోసారి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసు కేసు

Arun Chilukuri
Published on: 27 Feb 2021 4:37 PM IST
మరోసారి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసు కేసు
X

మరోసారి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసు కేసు

మరోసారి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన బంధువు గౌరీనాథ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు పంచడాని నగదు, క్రికెట్ కిట్లు దాచి ఉంచారని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 25న గౌరీనాథ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు దాదాపు 130 క్రికెట్ కిట్లు దొరికాయి. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, గౌరీనాథ్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story