Bhimavaram: నా కారునే ఆపుతావా.. కానిస్టేబుల్‌పై డ్రైవర్ దాడి

Bhimavaram: అసలే ర్యాష్ డ్రైవింగ్... ఆపై పోలీస్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఉదంతం భీమవరం పరిసరాల్లోని గునుపూడిలో చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 3 May 2022 4:15 PM IST
Car Driver Attack on Traffic Constable
X

Bhimavaram: నా కారునే ఆపుతావా.. కానిస్టేబుల్‌పై డ్రైవర్ దాడి

Bhimavaram: అసలే ర్యాష్ డ్రైవింగ్... ఆపై పోలీస్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఉదంతం భీమవరం పరిసరాల్లోని గునుపూడిలో చోటుచేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ తో పలువురిని గాయపరుస్తూ వెళ్తున్న కారుడ్రైవర్ ను ఆపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారుడ్రైవర్ విరుచుకుపడ్డారు. కానిస్టేబుల్ పై ఇష్టారాజ్యంగా పిడిగుద్దులు కురిపించాడు. భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందిన బొబ్బనపల్లి సంతోష్ ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో కేబుల్ పని చేసుకుంటున్న వ్యక్తిని గుద్ది, బైక్ పై వెళుతున్న మరో వ్యక్తిని గాయపరచి ఆపకుండా వెళ్లాడు. వీరమ్మ పార్క్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు సమాచారం అందించారు.

దీంతో కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ సతీష్ కుమార్ పై కారుడ్రైవర్ సంతోష్ విరుచుకు పడ్డాడు. ఏ ఊరు నుంచి వచ్చావు, నాకారు ఆపుతావా అని భూతులు తిడుతూ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. దాడిలో కానిస్టేబుల్ కు మెడ, చేతి భాగాల్లో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆగంతకుడుని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దౌర్జనానికి పాల్పడిన కారు డ్రైవర్ సంతోష్ పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story