Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో కారులో మంటలు

Tirumala: తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో ఓ కారులో మంటలు చెలరేగాయి.

Arun Chilukuri
Published on: 19 March 2022 4:34 PM IST
Car Catches Fire In Tirumala Ghat Road
X

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో కారులో మంటలు

Tirumala: తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో ఓ కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు కారు దిగి పరుగులు తీశారు. మంటలు చూసిన భక్తులు వెంటనే కారులో నుంచి దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తిరుమల చివరి మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. బాధితులు కర్ణాటకకు చెందినవారుగా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story