Car Accident at Nizampatnam: కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరి మృతి

X
Highlights
Car Accident at Nizampatnam: గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం మండలం గోకర్ణమఠం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన...
Arun Chilukuri30 July 2020 5:42 AM GMT
Car Accident at Nizampatnam: గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం మండలం గోకర్ణమఠం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిజాంపట్నంలో వివాహవేడుకకు హాజరై తిరిగివెళ్తుండగా.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి ఒకరిని కాపాడగా.. అప్పటికే ఇద్దరు మృతి చెందారు. మృతులు కర్లపాలెం మండలానికి చెందిన సాంబశివరావు రాజేంద్రగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Web Titlecar accident at Nizampatnam
Next Story