Andhra Pradesh: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తోటలు ధ్వంసం

* గంజాయి సాగు చేస్తున్న గ్రామాల వివరాలు సేకరించి ఇందుకోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు

R Tripura Malini
Published on: 20 Nov 2022 7:56 AM IST
Cannabis Plantation Destroyed In Andhra-Odisha border
X

ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తోటలు ధ్వంసం

Demolishing Marijuana: ఏవోబీలో గంజాయి కలుపు మొక్కను తుంచివేయాలన్న ఆలోచనతో రెండు రాష్ట్రాల పోలీసులు ముందుకెళ్తున్నారు. గత ఏడాది ఆపరేషన్ పరివర్తన పేరిట అల్లూరి జిల్లాలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అయితే ఆంధ్రాలో గంజాయి తోటలు ధ్వంసం చేయడంతో పాటు.. కేసులు నమోదు చేస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ఒడిశా గ్రామాలపై దృష్టి సారించి విస్తృతంగా గంజాయి సాగు చేశారు. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు సరిహద్దుల్లో గంజాయి సాగుపై దృష్టి సారించారు. గంజాయి సాగు చేస్తున్న గ్రామాల వివరాలు సేకరించి ఇందుకోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story